AP: 'తల్లికి వందనం' పథకంపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. దీంతో పేద విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు అకౌంట్లోకి జమ కానున్నాయి. కాగా నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో 'తల్లికి వందనం' పథకానికి ప్రభుత్వం రూ.9,407 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.