AP: కడప జిల్లా పులివెందుల మండలంలో నిర్వహించిన గంగమ్మ చింతల జాతరలో అపశృతి చోటు చేసుకుంది. ఆర్ తుమ్మలపల్లిలో ఏటా శివరాత్రి మరుసటి రోజు ఈ జాతర నిర్వహిస్తారు. గ్రామస్తులు సిరిమాను బండిని కాడెద్దులకు కట్టి గ్రామం నుంచి గంగమ్మ ఆలయానికి తీసుకెళ్లారు. అయితే అక్కడ పూజల అనంతరం తిరిగి గ్రామానికి వచ్చే క్రమంలో అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ సుదర్శన్ ప్రమాదవశాత్తూ బండి కింద పడి చనిపోయాడు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.