AP: సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో ఇవాళ భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్‌తో సమావేశమవుతారు. అనంతరం కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో వైజాగ్ స్టీల్‌ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి నిర్మలా సీతారామన్‌తో సీఎం ప్రస్తావించే అవకాశం ఉంది.