అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో కార్చిచ్చు శరవేగంగా విస్తరిస్తోంది. కాస్టెయిక్ సరస్సు సమీపంలోని కొండ ప్రాంతంలో మొదలైన అగ్నికీలలు ఒక రోజు వ్యవధిలోనే 41 చదరపు కిలోమీటర్ల పరిధిలోని చెట్లను, పొదలను బూడిద చేశాయని అధికారులు వెల్లడించారు. తాజాగా కార్చిచ్చు విస్తరించిన ప్రాంతం ఇటీవల అగ్నికి ఆహుతైన ఈటన్, పాలిసేడ్స్‌కు 64 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.