దిల్ రాజు ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు

80చూసినవారు
దిల్ రాజు ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, తెలంగాణ FDC ఛైర్మన్ దిల్ రాజు ఇంట్లో గురువారం అర్ధరాత్రి ఐటీ రైడ్స్ ముగిశాయి. మూడు రోజుల పాటు ఐటీ అధికారులు ఆయన ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. దిల్ రాజుతో పాటు ఆయన సోదరుడు శిరీష్, కూతురు హన్షితరెడ్డి, బంధువుల నివాసాల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సోదాల నేపథ్యంలో ఆయన తల్లి అస్వస్థతకు గురికాగా ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్