ఏపీలో ఇప్పటికే అమలు చేసిన పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలు ఏమనుకుంటున్నారనే అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ప్రతి నెలా అధికారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నేడు 4 శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ వారం రెవెన్యూ సర్వీసులు, ఆసుపత్రుల్లో సేవలు, దేవాలయాలు, మున్సిపల్ శాఖలోని సేవల్లో వచ్చిన రిపోర్టులపై సమీక్షించారు. పదేపదే ఫిర్యాదులు వస్తున్న విభాగాల్లో బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.