పెళ్లైన ఎనిమిది రోజులకే పెళ్లి కుమారుడు మరణించిన ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగింది. సిద్ధరాజ్ సిన్హ్ జడేజా అనే యువకుడికి వారం క్రితమే పెళ్లయింది. అతను పని నిమిత్తం తన బుల్లెట్ బైక్‌పై బయటికి వచ్చాడు. రాజ్‌కోట్‌లోని దేబర్ రోడ్డు మీదుగా వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.