జనవరి 1 నుంచి జనన, మరణాల నమోదుకు కొత్త పోర్టల్‌ను అందుబాటులోకి తేనున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆర్టీజీఎస్‌పై మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్ వాట్సాప్ గవర్నెన్స్ దే కావడంతో పాలనలో సాంకేతిక వినియోగాన్ని మరింత పెంచాలని అధికారులకు సూచించారు. అలాగే సచివాలయాల్లో మరో వెయ్యి ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.