ఒలింపిక్స్ అథ్లెటిక్స్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించే క్రీడాకారులకు నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు ప్రపంచ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) తాజాగా ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్‌లోని 48 అథ్లెటిక్స్ విభాగాల్లో విజేతలకు ఈ ప్రైజ్ మనీ అందజేయనున్నట్లు పేర్కొంది. 2028 లాస్ ఏంజిలిస్ ఒలింపిక్స్ నుంచి స్వర్ణంతో పాటు రజత, కాంస్య పతక విజేతలకు నగదు బహుమతులు ఇస్తామని వెల్లడించింది. ఒక్కో విజేత 50 వేల డాలర్లు (రూ.సుమారు 41.60లక్షలు) అందుకోనున్నారు.