‘జైలర్’ దర్శకుడు నెల్సన్, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నెల్సన్ ‘జైలర్- 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టు తర్వాత ఎన్టీఆర్‌తో మూవీని తెరకెక్కించనున్నారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్, నెల్సన్ మూవీ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాకి ‘రాక్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇది నిజమో.. కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.