అక్కడ అన్నా క్యాంటీన్ల ప్రారంభం ఆలస్యం?

55చూసినవారు
అక్కడ అన్నా క్యాంటీన్ల ప్రారంభం ఆలస్యం?
ఏపీలో అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ కోసం ప్రయత్నాలు శరవేగంగా సాగుతున్నాయి. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో తొలి విడతగా 100 క్యాంటీన్ల పునరుద్ధరణ కోసం చంద్రబాబు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. విశాఖ జిల్లాలో మాత్రం ఈ క్యాంటీన్ల ప్రారంభం వాయిదా పడుతోంది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఆటంకంగా మారింది. దీంతో విశాఖలో ఈ కార్యక్రమం ఆలస్యం కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్