YCP కార్యాలయం కూల్చివేత.. జగన్ ఏమన్నారంటే?

58చూసినవారు
YCP కార్యాలయం కూల్చివేత.. జగన్ ఏమన్నారంటే?
తాడేపల్లిలో వైసీపీ కార్యాలయాన్ని కూల్చేయడంపై ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ స్పందించారు. ‘రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమకాండను మరో స్థాయికి తీసుకెళ్లారు. దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ కార్యాలయాన్ని కూల్చేశారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం కనుమరుగైపోయాయి. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా బాబు దుశ్చర్యలను ఖండించాలి. ఈ బెదిరింపులకు తలొగ్గేది లేదు.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్