మహారాష్ట్రలోని థానెలో భారీ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. గత రాత్రి ఓ ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో అనూహ్య ప్రమాదం జరిగింది. గ్రౌండ్‌లోని షెడ్ అకస్మాత్తుగా కూలిపోయింది. ఆ సమయంలో గ్రౌండ్‌లో 17 మంది చిన్నారులు ఆడుకుంటున్నారు. వారిలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సహచరులు స్పందించిన వారిని చికిత్స నిమిత్తం థానేలోని బెథానీ ఆస్పత్రిలో చేర్పించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.