AP: రైతు సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 13న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తామని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ర్యాలీ కోసం కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేస్తామన్నారు. జగన్ పథకాలను ఉద్దేశపూర్వకంగానే కూటమి ప్రభుత్వం తొలగిస్తోందని ఆరోపించారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు ప్రజలు, కార్యకర్తలు ముందుకు రావాలని ఆయన కోరారు.