నాగబాబుకు మంత్రి పదవి ఎలా ఖరారైందంటే?

77చూసినవారు
నాగబాబుకు మంత్రి పదవి ఎలా ఖరారైందంటే?
AP: రాష్ట్రంలో 24 మంది మంత్రులున్నారు. ఖాళీగా ఉన్న ఒక స్థానాన్ని నాగబాబుతో భర్తీ చేయనున్నారు. TDP పొత్తులో భాగంగా జనసేనకు 4, BJPకి 1 మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. జనసేన నుంచి పవన్, మనోహర్, దుర్గేశ్ ఇప్పటికే మంత్రులుగా ఉన్నారు. జనసేనకు దక్కాల్సిన మరో స్థానాన్ని నాగబాబుకు ఇచ్చినట్లు సీఎం ప్రకటించారు. ఆయనను మొదట మంత్రివర్గంలోకి తీసుకుని ఆ తర్వాత ఎమ్మెల్సీని చేస్తారా, లేక ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత క్యాబినెట్‌లోకి తీసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్