పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు గల్లంతు

76చూసినవారు
పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు గల్లంతు
AP: అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఊడిమూడి శివారు చింతావారి పేట సమీపంలో పంట కాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. భర్త ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కారు విశాఖపట్నం నుంచి పి.గన్నవరం మండలంలోని పోతవరం ఇంటికి వెళ్తుండగా తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన జరిగిన సమయంలో మహిళ డ్రైవింగ్‌ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్