AP: విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తరఫున పిటిషన్ దాఖలైంది. జైలులో ఉన్న వంశీ ప్రస్తుత బ్యారక్ మార్చాలంటూ న్యాయవాదులు పిటిషన్ వేశారు. వంశీ బ్యారక్ మార్చాలని... లేదంటే తన బ్యారక్‌లో కొందరు ఖైదీలను ఉంచాలని కోర్టును కోరారు. వల్లభనేని వంశీ బ్యారక్‌లో కనీసం మంచం కూడా పట్టడం లేదని ఆయన తరఫు న్యాయవాదుల పిటిషన్లో స్పష్టం చేశారు.