అన్న క్యాంటీన్ల రోజువారీ ఖర్చెంతో తెలుసా..?

1090చూసినవారు
అన్న క్యాంటీన్ల రోజువారీ ఖర్చెంతో తెలుసా..?
ఏపీలో గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్లను మధ్యలో వైసీపీ ప్రభుత్వం మూసేసింది. వాటిని ఇప్పుడు తిరిగి ప్రారంభించడంతో పాటు కొత్తగా మరికొన్ని క్యాంటీన్లను కూడా కూటమి సర్కార్ అందుబాటులోకి తెస్తోంది. తాజాగా సీఎం చంద్రబాబు గుడివాడలో ఇలా మొదటి అన్న క్యాంటీన్ ను పునఃప్రారంభించారు. హ‌రేరామా ట్రస్ట్ వీటికి ఆహారం సబ్సిడీపై సరఫరా చేస్తోంది. అన్న క్యాంటీన్లకు రోజువారీ అవుతున్న ఖర్చు అక్షరాలా రూ.78.75 లక్షలు.నెలకు రూ.19.68 కోట్లు. ఏడాదికి రూ.236.25 కోట్లు అని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్