ముంబైకి చెందిన సినీ నటి వేధింపులపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ అంశంపై మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందించారు. వైసీపీ నేతలు, పోలీసులు ప్రవర్తించిన తీరు హేయనీయం అని మండిపడ్డారు. మహిళపై అనుచితంగా ప్రవర్తించేందుకు వారికి మనసెలా వచ్చిందని డొక్కా నిలదీశారు. ఇలాంటి తప్పు చేసేందుకు మరొకరు భయపడాలన్నారు.