అస్సాంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా గొడ్డుమాంసం (బీఫ్)తో తయారు చేసే వంటకాలపై నిషేధం విధించింది. ఇకపై అస్సాం రాష్ట్రంలోని హోటల్స్, రెస్టారెంట్స్, బహిరంగ ప్రదేశాల్లో పశుమాంసంతో తయారు చేసిన వంటకాలు విక్రయరాదని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కొత్త నిబంధనల్ని చట్టంలో చేర్చాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు సీఎం హిమంత బిశ్వశర్మతెలిపారు.