ప్రముఖ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ సంస్థ ఉబర్‌కు భారీ షాక్ తగిలింది. కోర్టు రూ.54,000 జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఢిల్లీకి చెందిన ఓ జంట ఉబర్ క్యాబ్ ఆలస్యం కారణంగా ఇండోర్‌కు వెళ్లే విమానాన్ని కోల్పోయారు. దీంతో వారు జిల్లా కమిషన్‌ను ఆశ్రయించారు. ఎయిర్‌పోర్టుకు బుక్ చేసుకున్న క్యాబ్ సమయానికి రాలేదని సదరు ప్రయాణికుడు పేర్కొన్నాడు. దీంతో ఉబర్ సంస్థకు న్యాయస్థానం రూ.54 వేలు ఫైన్ వేసింది.