చట్టాలంటే భయం లేకుండాపోయింది: కేంద్ర మంత్రి

69చూసినవారు
చట్టాలంటే భయం లేకుండాపోయింది: కేంద్ర మంత్రి
దేశ చట్టాలంటే ప్రజలకు భయం లేకుండాపోయిందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. రోడ్డు ప్రమాదాల కారణంగా నిత్యం ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఈ ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. వాహనదారులు, ప్రజల నిర్లక్ష్యం వల్ల బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్