AP: డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాల నుంచే ప్రారంభం కావాలని సీఎం చంద్రబాబు అన్నారు. బాపట్లలో ఆయన మాట్లాడుతూ.. ‘తల్లిదండ్రులు పిల్లల చదువు పట్ల జాగ్రత్త తీసుకోవాలి. డ్రగ్స్ వ్యసనానికి దూరంగా ఉండాలి. డ్రగ్స్ వల్ల మానవ సంబంధాలు నాశనం అవుతాయి. కొందరు డ్రగ్స్‌ను కూరగాయ పంటల్లా సాగు చేస్తున్నారు. ఈగల్ పేరుతో డ్రగ్స్ నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేశాం. డ్రగ్స్ రక్కసిని కర్కశంగా అణచివేస్తాం.’ అని అన్నారు.