ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం, డిప్యూటీ సీఎంలు

83చూసినవారు
ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం, డిప్యూటీ సీఎంలు
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్, డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్, ఏక్‌నాథ్ షిండే ప్రమాణస్వీకారం చేశారు. శనివారం మహారాష్ట్ర శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ క్రమంలో ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విగ్రహానికి సీఎం, డిప్యూటీ సీఎంలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం, డిప్యూటీ సీఎంలతోపాటు ఎమ్మెల్యేలంతా శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్