AP: అనంతపురం జిల్లా పామిడిలో ఓ ఫంక్షన్ హాల్‌లో కాసేపట్లో పెళ్లి అనగా పెళ్లికూతురు ఆభరణాలు కనిపించకుండా పోయాయి. కంగారుపడిన వధువు కుటుంబ సభ్యులు… అప్పటికి ఎలాగోలా కుటుంబ సభ్యుల ఆభరణాలు పెళ్ళికూతురుకు అలంకరించి పెళ్లి తంతు ముగించారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి కూతురుకి మేకప్ వేయడానికి వచ్చిన బ్యూటీషియనే… ఆభరణాలు సర్దేసిందని పోలీసులు గుర్తించారు.