కడపలో నీటి సమస్యను తీర్చి ఇక్కడి ప్రజలను ఆదుకుంటానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ అన్నారు. తాగునీటి కోసం ఎక్కడా ఇబ్బంది రాకూడదనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. ‘2014-19 సంవత్సరంలో ఉద్దానం సమస్యను బయటకు తీసుకొచ్చా. ఆనాటి సీఎం చంద్రబాబు రూ.61 కోట్లతో ఉద్దానం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారు. కడపలో ఇంత నీటి సమస్య ఉందని నేను అనుకోలేదు. పులివెందుల తాగునీటి ప్రాజెక్టుకు రూ.45 కోట్లు ఇచ్చాం’ అని పేర్కన్నారు.