AP: చదువుల నేల రాయలసీమ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం రాయలసీమ అని అన్నారు. అన్నమయ్య, వేమన, పుట్టపర్తి, కేవీ రెడ్డి, నారాయణాచార్యులు, ఉయ్యాలవాడ, గాడిచర్ల సర్వోత్తమరావు, నరసింహారెడ్డి లాంటి మహానుభావులు ఇక్కడే పుట్టారన్నారు. రాయలసీమ అంటే అభివృద్ధిలో వెనుకబాటు కాదని, అవకాశాల కోసం ముందుండి నడిచే ప్రాంతం కావాలని ఆకాంక్షించారు.