మద్యం మత్తులో వేడి నూనె ఒంటిపై పోశాడు (వీడియో)

71చూసినవారు
ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట మండలం పెన్నపేరూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెన్నపేరూరు గ్రామానికి చెందిన ప్రభాకర్‌పై సుబ్బారెడ్డి మద్యం మత్తులో దాడి చేశాడు. సలసల కాగుతున్న నూనెను ఒంటిపై పోశాడు. దాంతో ప్రభాకర్ శరీరం పూర్తిగా కాలిపోయింది. తీవ్రంగా గాయపడిన ప్రభాకర్‌ను కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్