పెదపూడిలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదాల నివారణ పై ఎస్సై రామారావు అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు వాహనాలు నడిపేప్పుడు రోడ్డు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు బైకులు నడిపేప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసులు తదితరులు పాల్గొన్నారు.