ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుంది

80చూసినవారు
న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. పెదపూడి మండలం వేండ్రలో గురువారం న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమం చేపట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనపర్తిలో టీడీపీని కాపాడాలి, పార్టీ ఉనికిని చాటుకోవాలనే లక్ష్యంతోనే న్యాయం కోసం నల్లమిల్లి చేపట్టినట్లు చెప్పారు.