పంటలు నష్టపోయిన రైతన్నలను ఆదుకోవాలి

84చూసినవారు
జగ్గంపేట నియోజకవర్గంలో వరదల వల్ల వేలాది ఎకరాలలో పంటలు నష్టపోయిన రైతన్నలను ఆదుకోవాలని ఉద్యమనేత పాటంశెట్టి సూర్యచంద్ర కోరారు. బుధవారం జగ్గంపేటలో నీటిమునిగిన పంట పొలాలను పరిశీలించడానికి వచ్చిన అధికారులను సూర్యచంద్ర కలిశారు. పంటలకు పూర్తిస్థాయి నష్టపరిహారం ఇవ్వాలని శాశ్వత పరిష్కారం కోసం ఖండి కాలువ పూర్తిస్థాయిలో తవ్వించాలని, పుష్కర నీరు ఖండికాలువలోకి రాకుండా ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్