ముంపు నివారణకు చర్యలు చేపట్టాలి

75చూసినవారు
ముంపు నివారణకు చర్యలు చేపట్టాలి
జగ్గంపేట నియోజకవర్గంలో వర్షాకాలం నేపథ్యంలో పంటలు ముంపునకు గురికాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు. శుక్రవారం కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పలు సమస్యలను ఆయన ప్రస్తావించారు. జగ్గంపేట నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వకుండా చేపట్టవలసిన చర్యలపై ఆయన అధికారులకు వివరాలు తెలియజేశారు. పంటలు మునిగి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్