నిడదవోలులో రెండు బైక్స్ ఢీకొన్న ఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉండ్రాజవరానికి చెందిన గాలికి జానకిరామ్, భార్య పుష్పతో గౌరీపట్నం బంధువుల ఇంటికి వెళ్లి స్వగ్రామానికి వెళ్తుండగా నిడదవోలు డిగ్రీ కళాశాల సమీపంలో వెనుక నుంచి వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలకు గాయాలు అయ్యాయి.