భారీ వర్షాలు, వరదల కారణంగా ముంపునకు గురైన విజయవాడ నగరంలో గురువారం పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వారి సేవలను అందించారు. బాధిత ప్రజలకు తన వంతు సహాయం అందించేందుకు గురువారం ఆయన వెళ్లి విజయవాడలోని 19వ వార్డులో చినరాజప్ప పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అక్కడ జరుగుతున్న సహాయక చర్యల్లో భాగంగా బాధితులకు అండగా నిలిచి ఆహార పదార్థాలను పలువురికి అందజేశారు.