తూ గో జిల్లా వ్యాప్తంగా 19 మండలాల్లో గురువారం ఉదయం నుంచి సచివాలయ సిబ్బంది పింఛన్ల పంపిణీకి పోటీపడ్డారు. ఈ క్రమంలో గోపాలపురంలో అత్యధికంగా 98. 66% పంపిణీ చేశారు. అలాగే చాగల్లులో 98. 49%, కోరుకొండలో 98. 48%, రాజమండ్రి సిటీ 98. 42%, కొవ్వూరు 98. 30%, నిడదవోలు 98. 26%, నల్లజర్లలో 98. 13%, రాజానగరం 98. 06 %, తాళ్లపూడిలో 98 %, రాజమండ్రి రూరల్‌లో 97. 91 % పంపిణీ జరిగింది. అత్యల్పంగా రంగంపేట 96. 81%గా ఉంది.