ప్రతీ ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి: కలెక్టర్

81చూసినవారు
ప్రతీ ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి: కలెక్టర్
ఎన్నికల విధుల్లో అత్యవసర సేవలు అందించే ఉద్యోగులకి పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. కే. మాధవీలత ఆదివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీలకు సమాచారం అందించామని, వారి తరఫున ఏజెంట్లను నియమించుకుని, రిటర్నింగ్ అధికారికి వివరాలు తెలపాలన్నారు.

సంబంధిత పోస్ట్