Oct 07, 2024, 17:10 IST/జడ్చర్ల నియోజకవర్గం
జడ్చర్ల నియోజకవర్గం
మహబూబ్ నగర్: డీఎస్సీ అభ్యర్థుల తుది జాబితా
Oct 07, 2024, 17:10 IST
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో డిస్సీ అభ్యర్థుల తుది జాబితా సోమవారం కొలిక్కి రానుంది. మొత్తం 1, 077 టీచర్ పోస్టుల భర్తీకి సర్టిఫికెట్ల పరిశీలన ఇప్పటికే ముగిసింది. 1: 3లో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు 2, 636 మంది ఎంపిక కాగా 2, 440 మంది హాజరయ్యారు. 1: 1 జాబితా రాగానే వారికి పోస్టింగ్ ఇస్తామని విద్యాధికారులు తెలిపారు. ఈ నెల 9 న నియామక పత్రాలు అందించాక కొత్త టీచర్లకు ఆన్ లైన్లో కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉందన్నారు.