దేవీపట్నం: కోడిపందాల శిభిరంపై దాడి.. ముగ్గురిపై కేసు నమోదు
దేవీపట్నం మండలంలోని ఇందుకూరుపేటలో కోడిపందాల శిబిరాలపై పోలీసులు దాడి చేశారు. ఎస్ఐ షరీఫ్ వివరాల ప్రకారం.. ఇందుకూరుపేటలో బుధవారం కోడిపందాలు ఆడుతున్నట్లు సమాచారం రావడంతో శిబిరంపై దాడి చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు. రెండు కోళ్లతో పాటు, కోడికత్తులు, ఆరువేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.