ఈ నెల 16న సోమవారం అంబేడ్కర్ కోనసీమ కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. మిలాద్- ఉన్-నబీ పండుగ సెలవు దినం నేపథ్యంలో సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించడం లేదని ఆయన శనివారం తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని సూచించారు.