అమలాపురం: 102 మంది బాలలను దైవాంశ సంభూతులుగా భావించి పూజలు

64చూసినవారు
శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా అమలాపురం శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో బాల పూజ మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. 102 మంది బాలలను దైవాంశ సంభూతులుగా భావించి వారికి పూజలు చేశారు. హిందూ సంప్రదాయ ప్రకారం బాలలు దుస్తులు ధరించి ఈ పూజలో పాల్గొన్నారు. బాలలకు అభిషేకం, పాదపూజ, అర్చనలు చేశారు. బాల పూజ మహోత్సవం ఆధ్యంతం కన్నుల పండుగగా జరిగింది. భారీ సంఖ్యలో మహిళలు అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్