అమలాపురంలోని ఎంఎస్ఎన్ కాలనీ వద్ద రాముడు అనే వ్యక్తి ఇంట్లో సోమవారం రాత్రి ఒక తాచు పాము దూరి హల్చల్ చేసింది. వెంటనే స్థానికులు స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించడంతో ఆయన సంఘటన స్థలానికి చేరుకొని పామును చాకచక్యంగా డబ్బాలో బంధించారు. జనావాసాలకు దూరంగా ఉన్న ప్రాంతాలలో పామును విడిచిపెట్టినట్లు గణేష్ వర్మ తెలిపారు.