అమలాపురం: 12 ఇసుక ర్యాంపుల్లో తవ్వకాలు జరిపేందుకు చర్యలు

62చూసినవారు
కోనసీమలోని 12 ఇసుక ర్యాంపుల్లో నీటి ప్రవాహం తగ్గగానే ఇసుక తవ్వకాలు నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో అజెండా అంశాలను అంశాల వారీగా కమిటీ సభ్యులతో కలెక్టర్ చర్చించారు. ఇసుక ర్యాంపుల నిర్వహణపై ఆయన సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్