11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలలోపు కిషోర బాలికల రక్షణ, భద్రత అందరి బాధ్యతగా గుర్తించి వారిని కంటికి రెప్పల కాపాడాలని ఐసీడీఎస్ అమలాపురం ప్రాజెక్ట్ అధికారిణి విజయశ్రీ సూచించారు. చదువుకునే వయస్సులో బాల్య వివాహాలు చేస్తే చట్టరీత్యా నేరమని వివరించారు. అమలాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం జరిగిన కిషోర వికాస మండల స్థాయి శిక్షణా తరగతులు నిర్వహించారు. ఎంపీడీవో బాజ్జి రాజు, పాల్గొన్నారు.