కోనసీమ జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో 54 గ్రామాలకు చెందిన మత్స్యకారులకు ఆరో విడత ఓఎన్ జీసీ నష్టపరిహారాలు ఈ నెల 28న తాళ్లరేవు మండలం కోరంగిలో అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. అమలాపురంలో మంగళవారం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో అధికారులతో సన్నద్ధత ఏర్పాట్లపై సమీక్షించారు. 16, 408 మందికి ఒక్కొక్కరికి రూ. 11, 500 వంతున రూ. 103. 78 కోట్లు అందిస్తామన్నారు.