అమలాపురం: విద్యా విజ్ఞాన యాత్ర విజయవంతం: డీఈఓ

552చూసినవారు
కోనసీమ జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో మూడు రోజులు నిర్వహించిన విద్యా విజ్ఞాన యాత్ర విజయవంతమైనట్లు డీఈఓ సలీం భాష తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ 116 మంది విద్యార్థులు, 15 మంది గైడ్ టీచర్లు యాత్రకు వెళ్లారన్నారు. విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచేందుకు యాత్ర ఉపయోగపడిందన్నారు. విద్యార్థులు 3రోజులు యాత్ర ముగించుకుని వచ్చారన్నారు.

సంబంధిత పోస్ట్