అమలాపురం రూరల్ మండలం బండారులంక గ్రామ డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే ఆనందరావును గ్రామస్థులు కోరారు. శుక్రవారం గ్రామస్థులు, సర్పంచ్ సునీత, చింత శంకరమూర్తి ఎమ్మెల్యే ఆనందరావును కలిసి వినతిపత్రం సమర్పించారు. సుమారు 200 మంది మహిళలు ఎమ్మెల్యేను కలిశారు. దీనిపై డీఆర్వో స్పందించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.