మహిళల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయురాలు సావిత్రిబాయి ఫూలే అని ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ రావు అన్నారు. ఆయన అమలాపురంలోని బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద శుక్రవారం నిర్వహించిన ఫూలే జయంతి వేడుకలలో పాల్గొని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుడిపూడి భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.