అమలాపురం: బాధిత కుటుంబానికి జనసైనికులు ఆర్థిక సాయం

58చూసినవారు
అమలాపురం మండలంలోని బండారు లంకకు చెందిన జనసేన పార్టీ రాష్ట్ర చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి బట్టు పండు ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర టీడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సోమవారం పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పండు కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం జనసైనికులు సమకూర్చిన రూ. 12 లక్షల నగదు చెక్కును కుటుంబ సభ్యులకు స్థానిక నాయకులతో కలిసి ఆయన అందజేశారు.

సంబంధిత పోస్ట్