విజయవాడలో ఈ నెల 5 వ తేదీన జరిగే హైందవ శంఖారావం కార్యక్రమంలో హిందూ బంధువులంతా భారీగా పాల్గొని విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు కోరారు. శుక్రవారం అమలాపురం ప్రెస్ క్లబ్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. హిందూ దేవాలయాలు స్వయం ప్రతిపత్తిని కోరుతూ విశ్వహిందూ పరిషత్ దేశ వ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభిస్తుందన్నారు.