కోనసీమ శెట్టిబలిజ వన సమారాధన పోస్టర్లను ఎమ్మెల్సీ కుడుపూడి సూర్య నారాయణ, మాజీ కౌన్సిలర్ వాసంశెట్టి సత్యం ఆదివారం ఆవిష్కరించారు. రెండు వర్గాలుగా వన సమారాధనలు కాకుండా ఒక్కటిగా చేయాలని శెట్టిబలిజ నేతలు గతవారం నిర్ణయం తీసుకున్నారు. గతంలో మాదిరిగా అమలాపురం ఎత్తు రోడ్డు సత్తెమ్మతల్లి చెట్టు వద్ద ఉన్న లేఅవుట్లోనే జరగాలని కార్మిక శాఖ మంత్రి సుభాష్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.